నైరుతి రుతుప‌వ‌నాలు..కీ అప్ డేట్

18
- Advertisement -

వాతావరణ శాఖ తీపి కబురును అందించింది. ఈ నెల 31వ తేదీ నాటికి నైరుతీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నాలుగు రోజులు ముందుగానీ, లేక ఆల‌స్యంగా కానీ కేర‌ళ‌లోకి ఎంట‌ర్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయని తెలిపింది.

నైరుతి రుతుపవనాల ప్రభావంఓ జూన్ నెల‌లో వ‌ర్షాలు విస్తారంగా కురిసే ఛాన్సు ఉన్న‌ట్లు వెల్లడించింది. ప్ర‌స్తుతం కేర‌ళ‌లోని కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. తిరువనంత‌పురంలో రాత్రి నుంచి వ‌ర్షం కురుస్తోండగా పాతాన‌మిట్ట‌, ఇడుక్కీ జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. మ‌రో 8 జిల్లాల్లో ఆరెంజ్ అల‌ర్ట్ ఇచ్చారు.

అలాగే పలు రాష్ట్రాల‌కు హీట్‌వేవ్ వార్నింగ్ ఇచ్చింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఢిల్లీ, పంజాబ్‌, యూపీ రాష్ట్రాల్లో తీవ్ర‌మైన ఎండ‌లు ఉన్న‌ట్లు పేర్కొంది.

Also Read:మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు!

- Advertisement -