KTR:ప్రజా పాలన కాదు రైతు వ్యతిరేక పాలన

18
- Advertisement -

ఇది ప్రజాపాలన కాదు రైతు వ్యతిరేక పాలన అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన అని ఆరోపించారు.గ్యారెంటీ కార్డులో.. “వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని సన్నాయి నొక్కులు నొక్కుతారా ?? అని ప్రశ్నించారు.

ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి..ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ??, నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు..కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు..కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు అని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే..
నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. కాంగ్రెస్ సర్కారు అన్నారు.

Also Read:ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ..మిరాయ్

- Advertisement -