- Advertisement -
తాను రేవ్ పార్టీ, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని కాదన్నారు హీరో శ్రీకాంత్. కర్ణాటక రేవ్ పార్టీలో తెలుగు నటులు ఉన్నారని వార్తలు వస్తుండగా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే హేమ తాను ఈ పార్టీకి వెళ్లలేదని స్పష్టం చేయగా తాజాగా హీరో శ్రీకాంత్ స్పందించారు.
హీరో శ్రీకాంత్ కూడా పట్టుబడ్డాడని వార్తలు వస్తుండగా రేవ్ పార్టీలో దొరికింది తాను కాదని తెలిపారు హీరో శ్రీకాంత్. తాను రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని కాదని తప్పుడు కథనాలను నమ్మవద్దని వీడియో రిలీజ్ చేశారు శ్రీకాంత్.
తాను ఆ సమయంలో హైదరాబాదులోనే ఉన్నానని శ్రీకాంత్ చెప్పారు. బెంగళూరు వెళ్లలేదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు.
- Advertisement -