ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సం మృగశిర కార్తె సందర్భంగా చేపమందును పంపిణీ చేస్తామని ప్రకటించారు బత్తిని బ్రదర్స్. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమై జూన్ 9న సాయంత్రం ముగుస్తుందని తెలిపింది బత్తిని ఫ్యామిలీ.
ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబం చేప మందు పంపిణీ చేస్తుండటం అనవాయితీగా వస్తోంది. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని ప్రజల నమ్మకం. ఈ చేప ప్రసాదం కోసం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం వేల సంఖ్యలో వస్తుంటారు.
Also Read:రూ.500 నోట్లు రద్దు..కేంద్రం క్లారిటీ!
బత్తిని కుటుంబీకులు పంపిణీ చేస్తున్న చేప మందు.. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి చాలా మంచిదని ఎన్నో ఏళ్లుగా నమ్మకంతో ఇక్కడి వస్తుంటారు బాధితులు. అయితే.. ఈసారి కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

