Yadadri:భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి

11
- Advertisement -

యాదాద్రి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుండి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించింది. వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించే నియమం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది.

నిత్య కల్యాణం, హోమం, జోడు సేవలు, శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా నియమాన్ని అమలు చేయనుంది. సాధారణ ధర్మ దర్శనం క్యూలైన్‌లో వచ్చే భక్తులకు ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్ రావు తెలిపారు.

బోర్డులోనే క్యూఆర్ కోడ్‌ స్కాన్ చేస్తే ఫోన్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో క్షేత్ర మహత్మ్యం వివరాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈవో భాస్కర్ రావు తెలిపారు.

- Advertisement -