KTR:అచ్చంపేట ఘటనపై రాహుల్‌కి ట్వీట్

18
- Advertisement -

నాగ‌ర్‌క‌ర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం మూకుమ్మడిగా కర్రలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. అక్కడే పోలీసులు ఉన్న వారిని కనీసం అడ్డుకోలేదు.

ఈ ఘటనపై స్పందించారు కేటీఆర్. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ట్వీట్ చేస్తూ.. యాహీ హై క్యా ఆప్కీ “మొహబ్బత్ కీ దుకాన్” అంటూ రాహుల్‌కి ట్యాగ్ చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని కోరారు. ప్రత్యర్థులపై దాడి, అధికార దుర్వినియోగంలో పోలీసుల భాగం కావడం సిగ్గుచేటు. దాడికి కారణమైన ఈ గూండాలను, ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేకుంటే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

Also Read:Ram:డ‌బుల్ ఇస్మార్ట్ టీజ‌ర్

- Advertisement -