అల్లు శిరీష్.. “బడ్డీ” లిరికల్

9
- Advertisement -

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న బడ్డీ సినిమా నుంచి ఈ రోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు.

రేపు ఉదయం 10 గంటలకు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘ఆ పిల్ల కనులే..’ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. హిప్ హాప్ తమీజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న బడ్డీ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.

Also Read:భరత్, వాణి భోజన్‌.. ‘మిరల్’

- Advertisement -