బీజేపీని గెలిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్…బీజేపీ పట్ల కూడా తెలంగాణ ప్రజలకు సానుకూలత లేదు అన్నారు. పెట్రోల్, డిజీల్, నిత్యావసర వస్తువుల ధరలు పిరం అయిన తర్వాత మోడీ మీద వ్యతిరేకత కనబడుతుందన్నారు.
కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్… ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్టు వ్యవహరిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోందన్నారు. కొత్త జిల్లాలను రద్దు చేయాలని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చిల్లర ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలో వచ్చిన పారాచూట్ లీడర్లకు సీట్లు కేటాయించిందని…. బీజేపీ అభ్యర్థులు ఆరేడుగురు, కాంగ్రెస్లో నలుగురు అభ్యర్థులు మా పార్టీ నుంచి పోయిన వారే ఉన్నారన్నారు. ఆరేడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన నాయకులను పెట్టిందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇలా ఆరేడు సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించేందుకు రేవంత్ ప్రయత్నించారన్నారు.
Also Read:Akhilesh:బీజేపీ గ్రాఫ్ పతనమవుతోంది