- Advertisement -
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలీతపై కేసు నమోదైంది. . ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలను నకాబ్ తీసి ముఖం చూపించాలని వారి ఓటర్ ఐడీలను వెరిఫికేషన్ చేశారు మాధవీలత. అజాంపూర్ లోని పోలింగ్ బూత్ నెంబర్ 122లో ఈ వెరిఫికేషన్ చేశారు.
ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశాలతో మలక్పేట్ పీఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓటర్ల స్లిప్ లను పరిశీలించారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. మాధవీలత ఓటర్ ఐడీలు, స్లిప్ లను పరిశీలిస్తూ ఓటర్లను తనిఖీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఓటర్ స్లిప్ ల తనిఖీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ అన్నారు.
Also Read:Akhilesh:బీజేపీ గ్రాఫ్ పతనమవుతోంది
- Advertisement -