ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు

17
- Advertisement -

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఉదయం నుండే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. పులివెందుల భాకరాపురంలోని జయమ్మకాలనీ 138వ పోలింగ్ సెంటర్ వద్ద ఓటు వేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు.అంతకుముందు సీఎం జగన్ మోహన్ రెడ్డి అందరూ తప్పకుండా ఓటువేయాలని పిలుపునిచ్చారు.

ఉండవల్లిలో ఓటు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి. అలాగే విజయవాడలో ఓటు వేశారు సీఈవో ఎం.కె.మీనా.ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు ఓటర్లు. 6.30 గంటలకు ఓటర్లను బూతులలోకి అనుమతించారు.

Also Read:సత్యదేవ్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌

- Advertisement -