KCR:ప్రాంతీయ పార్టీలే కీలకం

20
- Advertisement -

రానున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయన్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందన్నారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేసీఆర్..కొత్త‌గా ఏర్పడ‌బోయే కేంద్ర స‌ర్కారులో నామా నాగేశ్వ‌ర్ రావు కేంద్ర మంత్రి అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు.

రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో త‌మ పార్టీ రెండు అంకెల సీట్ల‌ను గెలుస్తుంద‌ని అన్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని, బీజేపీకి గెలిచే అవ‌కాశాలు లేవ‌న్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ త‌న ఎన్నిక‌ల హామీల‌ను గ‌డిచిన ఆరు నెల‌లుగా నెర‌వేర్చ‌లేద‌ని, రేవంత్ రెడ్డి స‌ర్కారు ప‌ట్ల రాష్ట్ర ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.

రైతులు త‌మ పాల‌న స‌మ‌యంలో ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నార‌ని, ప్ర‌స్తుతం వాళ్లు కూడా ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తెలిపారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఆ ప్ర‌భావం క‌నిపిస్తుంద‌న్నారు.త‌మ ప్ర‌భుత్వం తాగు నీరు, వ్య‌వ‌సాయ నీరు, నిరంత‌ర విద్యుత్తును అందించింద‌ని, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోస‌పూరిత వాగ్దానాల‌కు ప్ర‌జ‌లు ఆక‌ర్షితులైన‌ట్లు కేసీఆర్ తెలిపారు.

Also Read:వెన్నెల కిశోర్..OMG టీజర్

- Advertisement -