సీఎం రేవంత్ రెడ్డితో తనకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. వందరోజుల్లోనే రేవంత్ నైజం భయటపడిందని…కేసీఆర్ మాదిగలకు రెండు టికెట్లు ఇచ్చారు.. కాంగ్రెస్ ఒక్క టికెట్ ఇవ్వలేదన్నారు. ఇది సోనియా కాంగ్రెస్ కాదని.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని ఆరోపించారు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి అని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వందల కోట్లు సంపాదించారని మండిపడ్డారు. దేవుళ్లపై ఒట్లు పెట్టిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. రేవంత్ తీరుతో మాదిగలు 50 ఏండ్లు వెనక్కి పోయారని..లోక్సభ ఎన్నికల్లో ఏడు స్థానాలు రెడ్డిలకే ఇచ్చారని, బలహీనవర్గాల నేతలు పార్లమెంటుకు పోవద్దా అని ప్రశ్నించారు.
కడియం శ్రీహరి కులం ఏంటో తెల్వదని ..ఆయనకు సిగ్గుందా.. కేసీఆర్ను మోసం చేసి పోతవా అని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులు ఇచ్చిన కేసీఆర్.. నీకు ఏం తక్కువ చేశారని నిలదీశారు. వెంటనే దళితబంధును అమలు చేయాలని…ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని, ఎందుకు అమలు చేస్తలేవని ప్రశ్నించారు.
Also Read:వెన్నెల కిశోర్..OMG టీజర్

