దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. నాలుగో దశ ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుండగా ఎన్నికల కాల్స్‌తో ప్రజలు విసుగు చెందుతున్నారు. ప్రతిరోజూ ఐవీఆర్ఎస్, స్పామ్ కాల్స్ పదుల సంఖ్యలో తలనొప్పిగా మారాయి.
ఇక స్పామ్ కాల్స్‌తో ఇబ్బందులు పడుతున్నారా..?అయితే ఇలా చేయండి మీకు ఇక స్పామ్ కాల్స్ అనేవి రావు. ఎయిర్ టెల్ వినియోగదారులైతే ప్లే స్టోర్ నుంచి ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేసిన అనంతరం ప్రీ పెయిడ్ ఆప్షన్ దగ్గర సెలక్ట్ చేసిన అనంతరం కిందకు వెళ్లి మోర్ ఆప్షన్ సెలక్ట్ చేసి DND (Do Not Disturb) ఆప్షన్ ఎంచుకోవాలి.
తర్వాత మేనేజ్ పై క్లిక్ చేసి Block All సెలక్ట్ చేసి సబ్ మిట్ నొక్కితే ఇక స్పామ్ కాల్స్ రావు. Prepaid >More >DND >Manage >Block All >Submit).
ఇక జియో వినియోగదారులైతే My Jio యాప్ ఓపెన్ చేసి.. Menu >Settings >Service Settings >Do not Disturb > Fully Blocked >Save క్లిక్ చేస్తే.. స్పామ్, ఎన్నికల ఐవీఆర్ఎస్ కాల్స్ మీ మొబైల్ కు ఇక రావు.