తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీకి చెందిన ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మే 10 నుంచి 12 వరకు భగత్ శ్రీ జరగనుంది.ఈ సందర్భంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీరామానుజాచార్యులపై సాహితీ సదస్సు, సంగీత కార్యక్రమం జరుగనుంది.
మే 10వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు శ్రీ పెద్ద జీయర్ స్వామి సమేత శ్రీ చిన్న జీయర్ స్వామి అనుగ్రహ భాషణంతో ఉత్సవాన్ని ప్రారంభిస్తారు.తిరుమలలోని శ్రీవారి ఆలయంలో మే 22న నృసింహ జయంతి నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో స్వాతి నక్షత్రం ఆవిర్భావం సందర్భంగా నృసింహ జయంతిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ యోగ నరసింహ స్వామి వారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
శ్రీవారి ఆలయంలోని మొదటి ప్రాకారంలో, గర్భాలయానికి ఈశాన్యం వైపున ఉన్న మండపానికి పడమటి వైపున శ్రీ యోగ నరసింహస్వామి ఉప ఆలయాలు ఉన్నాయి. శ్రీ యోగ నరసింహస్వామి విగ్రహం శాస్త్ర ప్రకారం రూపొందించబడింది. ఇక్కడ స్వామివారు యోగ ముద్రలో దర్శనమిస్తారు. ఈ ఆలయం క్రీ.శ. 1330 మరియు క్రీ.శ. 1360 మధ్య నిర్మించబడిందని నమ్ముతారు. ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యులు శ్రీ యోగ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
Also Read:కోవిషీల్డ్.. టీకా వెనక్కి!