మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్ ప్రాంతానికి బ్రహ్మాండంగా నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు మాజీ సీఎం కేసీఆర్. నర్సాపూర్ రోడ్డు షోలో మాట్లాడిన కేసీఆర్…వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిందని.. ఒక్క ఉచిత బస్సు మినహా ఏది కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.
రైతుబంధు కూడా రేపు రేపు వ్యవసాయం చేసినోళ్లకే ఇస్తారంట.. పొలం దున్నినోళ్లకే ఇస్తారంట ఇదెక్కడి న్యాయం అన్నారు. రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇయ్యాలి.. కానీ కోతలు అయినయ్.. కల్లాలు అయినయ్ ఇప్పుడు రైతుబంధు వేస్తామని అంటున్నారు అని ఎద్దేవా చేశారు.
మంచినీళ్ల కోసం కోమటిబండ నుంచి నర్సాపూర్‌కు ప్రత్యేక లైన్ వేయించినా.. కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సాపూర్ లింక్ కావాలని.. శంకరంపేట నుంచి కాల్వలు తవ్వుతున్నారు.. మల్లన్నసాగర్ నుంచి ఒక్కసారి నీళ్లు రావడం మొదలైతే.. నర్సాపూర్ బంగారు తునక అవుతుందన్నారు. మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు. కొల్చారం మండలంలో మల్లినాథ సూరి పేరు మీద యూనివర్సిటీని పెడదామని అనుకున్నాం.. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేలా లేదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిందని.. ఒక్క ఉచిత బస్సు మినహా ఏది కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.
Also Read:హ్యాపీ బర్త్ డే…విజయ్ దేవరకొండ