చర్మ సమస్యలకు వీటితో చెక్!

27
- Advertisement -

నిమ్మకాయలో సీ విటమినే కాదు అనేక ఆరోగ్య ప్రయోజాలుఉన్నాయి. ప్రతిరోజూ నిమ్మరసం త్రాగండి,అలాగే మీ చర్మానికి అప్లై చేసి చర్మ సమస్యల నుండి బయటపడవచ్చు. నిమ్మరసంతో ఎసిడిటిని తొలగించడమే కాదు, కొవ్వును తొలగించడంలో సహాయ పడుతుంది.

నిమ్మకాయలో విటమిన్ బి, విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. జిడ్డును తీసివేసి చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తాయి. చరమ్మం ముడతలు పడకుండా ఉండటంలో సాయపడుతుంది.

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని మనలో చాలా మందికి తెలుసు.అయితే ఇంత తెలిసినా ఎప్పుడో ఒకసారి తీసుకుంటూ ఉంటాం. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసంతో మీ రోజును ప్రారంభిస్తే రోజంతా ఫ్రెష్‌గా ఉండటంలో సాయ పడుతుంది.

నిమ్మకాయను హ్యాండ్ లోషన్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీన్ని రోజ్ వాటర్‌లో మిక్స్ చేసి చేతులు, చర్మానికి రాసుకోవాలి. క్రమం తప్పకుండా చేస్తే, చర్మం యొక్క ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిమ్మకాయ ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం. ప్రకృతి ఇంత అద్భుతాన్ని మనకు అందిస్తే రసాయనాలు మరియు సింథటిక్ పదార్థాలను ఎందుకు ఉపయోగించాలి? ఓసారి ఆలోచించండి.

Also Read:నటిగా నా కల నిజమైంది:శర్వారి

- Advertisement -