BRS:రోజురోజుకు పెరుగుతున్న బీఆర్ఎస్ గ్రాఫ్

21
- Advertisement -

రోజురోజు బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి.మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్‌ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన మల్లారెడ్డి…ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్‌దే అన్నారు. స్థానిక అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును ఎవరు అడ్డుకోలేరని పేర్కొన్నారు.

లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్‌గిరి పార్లమెంట్ 38 శాతం, క్యాంటన్మెంట్‌లో 42 శాతం, బీజేపీ 28, కాంగ్రెస్ పార్టీకి 27 శాతమే గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో హైదరాబాద్‌ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే లక్ష్మారెడ్డిని గెలిపిస్తాయన్నారు.

Also Read:‘భలే ఉన్నాడే’పై మారుతి ప్రశంసలు

- Advertisement -