KTR:రాముడు అందరివాడు..

17
- Advertisement -

రాముడు అందరివాడని.. మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారన్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వినోద్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేటీఆర్…రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లనేనన్నారు. సిరిసిల్ల పట్టణం అతి సుందరంగా తీర్చిదిద్దామన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేత కార్మికుల కోసం రూ.3వేలకోట్లు ఖర్చు చేసి కార్మికులను కాపాడుకున్నామన్నారు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో ఒక్కటి అమలు చేసి మోగొల్లకు మహిళకు తాకులాట పెట్టిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా? చెప్పాలరన్నారు. వందరోజుల్లో రైతు రుణమాఫీ, పింఛన్లు వచ్చాయా? అంటూ ప్రశ్నించారు. ఓట్లు చేసుకునేటప్పుడు ఒక లెక్క.. ఓట్లు వేయించుకున్నాకా ఒక లెక్క ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అంటూ విమర్శించారు.

సిరిసిల్లలో అనేక అభివృద్ధి పనులు చేసినా, బీజేపీ ఒక్క పనికి చేసిందా..? ఒక్క శిలాఫలకం వేయని వారికి ఎందుకు ఓటు వేయాలన్నారు. మోదీ ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్‌, డీజిల్ రేట్లపై పన్నులు వేసి వసూలు చేశారని విమర్శించారు.

Also Read:‘భలే ఉన్నాడే’పై మారుతి ప్రశంసలు

- Advertisement -