Revanth:కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే

19
- Advertisement -

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే రాబోతుందని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన రేవంత్…సభలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గెలుపు ఖాయం అన్నారు. మొదటి ఎన్నికల్లో అత్యధిక మొజార్టీ రావి నారాయణరెడ్డికి వచ్చింది… ఆ తర్వాత రఘురాం రెడ్డికి వచ్చే మొజార్టీ చరిత్రలో నిలవబోతుందని తెలిపారు.

ఖమ్మం జిల్లాకు గొప్ప పోరాట చరిత్ర ఉందని… 1969 తెలంగాణ ఉద్యమం పాల్వంచ నుంచి ప్రారంభమైందన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలకు నేను దూరంగా ఉంటా. ఢిల్లీ పెద్దలు ఖమ్మం జిల్లాలో ప్రతిఒక్కరూ సీఎంలే అని చెప్పారన్నారు.

డిసెంబర్ 3న ఫలితాలు సెమీ ఫైనల్స్. ఇప్పుడు జరిగే ఎన్నికలు ఫైనల్స్. గుజరాత్ టీంను ఇంటికి పంపించాలని రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు పదేళ్లు బీజేపీ ఏం చేసింది.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. ఆగస్టు 15లోపు భద్రాద్రి రామయ్య సాక్షిగా రైతు రుణమాఫీ చేస్తామన్నారు.

Also Read:ఘనంగా దాసరి జయంతి వేడుకలు

- Advertisement -