TTD:టీటీడీ అందిస్తున్నసేవ‌లు భేష్‌

17
- Advertisement -

టీటీడీ అందిస్తున్న ద‌ర్శ‌నం, వ‌స‌తి, అన్న‌ప్ర‌సాదాలు, ఇత‌ర‌ సౌక‌ర్యాలు బాగున్నాయ‌ని ప‌లువురు భ‌క్తులు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డిని ప్ర‌శంసించారు. తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వంలోని మీటింగ్ హాల్‌లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

శ్రీవారి సేవ ఆన్‌లైన్‌ అప్లికేషన్ ఎంతో పరదర్శకత తో రూపొందించబడింది. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావు లేదు అన్నారు. శ్రీవారి సేవకులు దళారులకు డబ్బులు ఇవ్వకండి. ఏదైన సాంకేతిక స‌మ‌స్య‌లు ఉంటే ప‌రిష్క‌రిస్తాం అన్నారు. తిరుమలలో 7500 గదులు మాత్రమే ఉన్నాయి. ఇందులో 50 శాతం గదులు ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ లో కేటాయిస్తున్నాం. ఆన్లైన్లో గదులు దొరకని భక్తులు తిరుమలలో సిఆర్వోలో నమోదు చేసుకుని గదులు పొందవచ్చు. తిరుపతిలో కూడా గదులు పొందే అవకాశం ఉంది అన్నారు.

శ్రీ‌వారి ఆల‌యం మ‌హాద్వారం నుండి బంగారు వాకిలి వ‌ర‌కు ఒకే క్యూ లైన్ విధానంలో భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్నాం. విజిలెన్స్‌, ఆల‌య సిబ్బందికి శిక్ష‌ణ ఇచ్చి భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటాం అన్నారు. తిరుమ‌ల‌లో ప్రైవేట్ హోటళ్ళల్లో రేట్లు నియంత్రించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నాం. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఎపి టూరిజం వారికి త‌క్కువ అద్దెతో 4 హోట‌ళ్ళు కేటాయించాం. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వీధి వర్తకులను అదుపు చేస్తారు. రూ.300 టికెట్టు ర‌ద్ధు చేసుకుని, రీఫండ్ చేయ‌డానికి అవ‌కాశం క‌ల్పించ‌డం వీలుకాదు.ఈ సందర్భంగా టీటీడీప అందిస్తున్న సేవల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read:మా నమ్మకం ఆయనపైనే..వారికి ఈసారి భంగపాటే!

- Advertisement -