హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా అక్కంపేటలో కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా హరీశ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్…రేవంత్ తీరును ఎండగట్టారు. గుంపు మేస్త్రీకి మాటలెక్కువ.. చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవిష్యత్, తలరాతను మార్చే ఎన్నికలని.. ఆరు గ్యారంటీల్లో ఒక్కటే అమలుచేసి ఐదు అమలు చేశామని అబద్ధం చెబుతున్నారని నిలదీశారు.
కాంగ్రెస్ వచ్చాక మంచినీళ్లు వస్తలేవు, పింఛన్లు వస్తలేవు…కేసీఆర్ తెచ్చినవన్నీ తీసేస్తున్నారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ గోవిందా గోవిందా పాటలా మారాయి… దళిత బంధు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పింఛను అన్నీ గోవిందా అని తెలిపారు. వినోదన్నను గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేస్తాం…గత ఐదేండ్లలో కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం చేశాడో ఆలోచించాలన్నారు.
Also Read:కేఎల్ రాహుల్ స్థానంలో శాంసన్!

