తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో..హైలైట్స్ ఇవే

25
- Advertisement -

ఐదు న్యాయాలు,తెలంగాణకు ప్రత్యేక హామీలు పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది కాంగ్రెస్. హైదరాబాద్ గాంధీ భవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.

బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా, కాజీపేటలో రైల్వే కోచ్ వంటివి పొందుపర్చారు.అలాగే రాష్ట్రంలో మరిన్ని కేంద్రీయ విద్యాలయాలను, నవోదయ విద్యాలయాలను, జాతీయ క్రీడ విశ్వవిద్యాలయం ఏర్పాటు, నూతన ఎయిర్ పోర్టుల కట్టడాలు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)ఏర్పాటు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (IIFT) ఏర్పాటు చేస్తామని తెలిపారు.

హైదరాబాద్ లో నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు, 4 కొత్త సైనిక స్కూళ్లు, నేషనల్ ఏవియేషన్ యూనివర్శిటీ ఏర్పాటు, హైదరాబాద్ కు ఐటీఐఆర్ పాజెక్టు పునఃప్రారంభం, హైదరాబాద్ – విజయవాడ హైవే పక్కనుంచి ర్యాపిడ్ రైల్వే వ్యవస్థ, ప్రతి ఇంటికి సౌరశక్తి, రామగుండం – మణుగూరు ప్రత్యేక రైల్వే లైన్, వంటి హామీలను ఇచ్చారు. హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read:కేఎల్ రాహుల్‌ స్థానంలో శాంసన్!

- Advertisement -