అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తీయబోతున్న సినిమా మొదలైంది. ఇందులో సమంత, కీర్తి సురేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. నిన్న రామకృష్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ ఆ తర్వాత షూటింగ్ మొదలు పెట్టేసింది. తొలి షెడ్యూల్ 5 రోజుల పాటు జరగనుండగా, ఇందులో మాయా బజార్ సినిమాలోని పాటకి సంబంధించి కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నారట. తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించనుండగా, జమునగా అనుష్క నటించనుందని అంటున్నారు.
ఇక సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకునే జర్నలిస్ట్ పాత్రలో సమంత కనిపించనుంది. సావిత్రి జీవితంలో కీలకమైన వ్యక్తి జెమినీ గణేశన్. ఆ పాత్రను మాలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్ చేయనుండగా, విజయ్ దేవరకొండ ..సమంతకి భర్తగా కనిపించనున్నట్టు సమాచారం. సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడట. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై సమర్పిస్తున్నారు.