వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి, స్టార్ డైరెక్టర్స్ కొరటాల శివ, అనీల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజమౌళి, కొరటాల శివ, అనీల్ రావిపూడి, గోపీచంద్ మలినేని చేతుల మీదుగా ‘కృష్ణమ్మ’ ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా….
మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ మాట్లాడుతూ ‘‘‘కృష్ణమ్మ’ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ నుంచి నేను సినిమా చూస్తున్నాను. కొన్ని సన్నివేశాలైతే హాంట్ చేస్తూనే ఉన్నాయి. నేను ఎంజాయ్ చేసినట్లే ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారనిపిస్తోంది. మే 10న మూవీ రిలీజ్ కానుంది. మా డైరెక్టర్ వి.వి.గోపాలకృష్ణగారు గురించి చెప్పాలంటే ఆయనకు విజయవాడతో మంచు అనుబంధం ఉంది. ‘కృష్ణమ్మ’తో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. సత్యదేవ్‌గారు అద్భుతంగా నటించారు. ఆయనకు నేను అభిమానిగా మారిపోయాను. మా టీమ్ అందరికీ కంగ్రాట్స్. కొరటాల శివగారు అందించిన సపోర్ట్‌కి థాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ అతీరా రాజ్ మాట్లాడుతూ ‘‘మా టీమ్‌ను సపోర్ట్ చేయటానికి వచ్చిన రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్, అనీల్ రావిపూడిగారికి థాంక్స్. కృష్ణమ్మ’ నా తొలి తెలుగు సినిమా. రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన గోపాలకృష్ణగారికి, నిర్మాత కృష్ణగారికి, కొరటాల శివగారికి థాంక్స్. కాల భైరవ అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు. మా సినిమాను విడుదల చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారికి థాంక్స్. హీరో సత్యదేవ్‌గారు మాలాంటి నటీనటులకు ఇన్స్పిరేషన్. ఎంటైర్ టీమ్‌కు థాంక్స్’’ అన్నారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘రాజమౌళిగారు, అనీల్ అన్న, గోపీ అన్న, శివగారు చూపించిన ప్రేమాభిమానాలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. రెండు వారాలుగా ఈ సినిమా పరంగా అన్నీ పాజిటివ్ విషయాలనే వింటున్నాను. నన్ను ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేసేది నా అభిమానులు, సినీ ప్రేక్షకులే. ‘కృష్ణమ్మ’ సినిమా గురించి అందరం మాట్లాడుకునేలా ఉంటుంది. కొరటాలగారు సినిమాను ఓకే చేయగానే సినిమా సగం సక్సెస్ అనుకున్నాం. కథ నచ్చగానే ఈ సినిమాకు ఆయన సమర్పకుడిగా వ్యవహరించటానికి రెడీ అయ్యారు. ఈ జర్నీలో ఆయన సపోర్ట్ మరచిపోలేం. మా కృష్ణగారు వెనుకడుగు వేయకుండా సినిమాను నిర్మించారు. మా డైరెక్టర్ గోపాలకృష్ణగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. క్రికెట్‌కు సచిన్ ఎలాగో మన ఇండియన్ సినిమాకు రాజమౌళిగారు అలా. మనం గొప్పగా కలలు కనొచ్చు అని ఆయన రుజువు చేశారు. ఆయన్ని చూసి మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. ‘కృష్ణమ్మ’ సినిమా విషయానికి వస్తే.. మా డైరెక్టర్‌గారు సినిమాను రెండు గంటల పది నిమిషాలుగా తెరకెక్కించారు. కథ వినగానే ఇది వంద కోట్ల్ కంటెంట్ ఉన్న సినిమా అని అనుకున్నాను. అదే ఆయనకు చెప్పాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన లక్ష్మణ్, కృష్ణ నా ఫ్రెండ్స్‌గా అద్భుతంగా నటించారు. అతీర, అర్చన, నందగోపాల్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. కాల భైరవ మ్యూజిక్ అదరగొట్టేశాడు. సినిమా రిలీజ్ తర్వాత పాటలు ఇంకా పెద్ద హిట్ అవుతాయి. మా సినిమాటోగ్రాఫర్ సన్నీకి థాంక్స్. కృష్ణనది ఎన్ని మలుపులు తిరిగి దాని గమ్యస్థానం చేరుకుంటుందో మా కథలోనూ అన్నీ మలుపులుంటాయి. అలాంటి రస్టిక్ పాత్రలు, ఎమోషన్స్‌ను మా డైరెక్టర్‌గారు క్రియేట్ చేశారు. ఆయనకు రుణపడి ఉంటాను. మా సినిమాను రిలీజ్ చేస్తున్నమైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షోఎంటర్టైన్మెంట్స్ వారికి థాంక్స్. మే 10న సినిమాను అందరూ తప్పకుండా చూడండి’’ అన్నారు.
Also Read:GIC:పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’