రేవంత్ రెడ్డి చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అన్ని తప్పుడు పనులు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ లో ఎంపి అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షో లో మాట్లాడిన హరీష్..కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి, మా ఇంటి మీద వాలొద్దు అంటున్నడు..మాటలు ముద్దుగా చెబుతావు చేసే చేష్టలు సక్కగా లేవు అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎవరు?,మల్కాజ్‌గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎవరు?,వరంగల్ అభ్యర్థి కడియం కావ్య శ్రీహరి ఎవరు?,సికింద్రాబాద్లో పోటీ చేస్తున్న దానం నాగేందర్ ఎవరు? అని ప్రశ్నించారు హరీష్.
కాకులను వాలనియ్యా అని గధ్ధలను ఎత్తుకు పోయావు రేవంత్ రెడ్డి,మాట్లాడే హక్కు నీకు లేదు. అన్నీ జుటా మాటలు అని దుయ్యబట్టారు. సిఎం పదవి దిగజార్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు,రుణమాఫీ చెయ్యలేదు, హామీలు అమలు చెయ్యలేదు,రాజీనామా చేస్తావా అంటే పారిపోయిండు అన్నారు.అయితే తిట్లు లేకుంటే దేవుని మీద ఓట్లు. ఒక్కటన్న పేదలకు పనికి వచ్చే పని చేశారా..నాలుగు నెలలు అయ్యింది ఒక్కో అక్కకు, చెల్లికి 10 వేల రూపాయలు బాకీ పడిండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్యాణ లక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తా అన్నాడు,లక్ష తులాల బంగారం బాకీ పడ్డడు. బంగారం లేదు, కల్యాణ లక్ష్మి లేదు అన్నారు.కేసీఆర్ కల్యాణ లక్ష్మి ఇచ్చారు, కేసీయార్ కిట్ ఇచ్చారు,అవ్వా, తాతలకు పింఛన్లు ఇవ్వడం లేదు,కాంగ్రెస్ వాళ్లను ఒడగొట్టి బుద్ధి చెప్పాలన్నారు. రైతు బంధు 15 వేలు అని మోసం చేశారు,ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేయలేదు,విద్యార్థులకు 4 వేలు అని చేతులు ఎత్తేశారన్నారు.
బిజెపి వాళ్లు మనకు చేసింది ఏం లేదు,300 సిలిండర్ వెయ్యి చేశారు. 60 లీటరు పెట్రోల్ 110 చేశారన్నారు.బిజెపి అభ్యర్థి రఘునందన్ ఎన్నో మాయమాటలు చెప్పారు,ఒక్క పని చెయ్యలేదు. నాలుగేళ్ల తర్వాత ఎన్నిక వస్తె 54 వేల ఓట్లతో బండకేసి కొట్టారన్నారు.దుబ్బాకలో చెల్లని వ్యక్తి, గజ్వేల్ లో చెల్లుతుందా..వెంకట్రామి రెడ్డి మంచి వ్యక్తి, వంద కోట్లతో ట్రస్ట్ పెట్టీ సేవ చేస్తా అంటున్నారు..అలాంటి వ్యక్తిని గెలిపించాలని కోరుతున్నా అన్నారు.
Also Read:అశోక్ గల్లా..’దేవకీ నందన వాసుదేవ’ ఫస్ట్ సింగిల్