సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు

15
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది..

రేవంత్‌తో పాటు మరో నలుగురికి ఢిల్లీ పోలీసులు సమన్లు పంపించారు.అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ X హ్యాండిల్ షేర్ చేసిందని బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఇది ఫేక్ వీడియో అని బీజేపీ, కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేయడంతో IPC సెక్షన్ 153, 153A, 465, 469, 171G.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్ 66C కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read:KTR:ప్రజ్వల్‌ని ఎందుకు దేశం విడిచేలా చేశారు?

- Advertisement -