విజయాలకు పొంగిపోం…అపజయాలకు కుంగిపోం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…ఈ రెండున్నర దశాబ్దాల్లో ప్రజలు ఇచ్చిన సహకరాం మర్చిపోలేనిదన్నారు.
తెలంగాణ ప్రజల కోసం, వారి ఆకాంక్షల కోసం పోరాడిన గులాబీ దండుకు, ప్రాణాలు అర్పించి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వందలాదిమంది తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. 2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ను కేసీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు. కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అహర్నిషలు కృషి చేశామని తెలిపారు కేటీఆర్. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో బీఆర్ఎస్కు అద్భుతమైన స్పందన లభించిందని వెల్లడించారు. బోధించు, సమీకరించి, పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని ముందుకు నడుస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని వెల్లడించారు.
తెలంగాణ గొంతుకై..
ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తలపెట్టిన ఏ పనినైనా వదలకుండా ముందుకు తీసుకుపోయిన చరిత్ర గత రెండున్నర దశాబ్దాలలో ప్రజలందరికీ తెలుసు
బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని ముందుకు నడుస్తున్న పార్టీ… pic.twitter.com/AW9NS4IzPV
— BRS Party (@BRSparty) April 27, 2024