Kodali Nani:గుడివాడలో గెలుపు నాదే

43
- Advertisement -

గుడివాడలో గెలుపు తనదేనన్నారు కొడాలి కాని. వైసీపీ అభ్యర్థిగా నామినేషన్‌గా వేసిన అనంతరం మాట్లాడిన నాని…గుడివాడలో గెలుపు తనదేనన్నారు. రాజేంద్రనగర్ లోని తన స్వగృహం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గద్దెనెక్కించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మళ్ళీ జగనే సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని…మహిళ ఓటర్లు ఈసారి ఏకపక్షంగా ఓట్లు వేస్తారని, తమ పార్టీ 151కి మంచి సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. 2014లో చంద్రబాబు ప్రజలను ఏవిధంగా మోసం చేశారో మళ్ళీ అవే మోసాలతో ఎన్నికలకు వెళ్తున్నారని.. ప్రజాస్వామ్యంలో డబ్బు కంటే ప్రజల నమ్మకం పొందడమే ముఖ్యమని అన్నారు.

పరాయి దేశంలో డబ్బు సంపాదించుకుని, అక్కడ సంపాదించిన సొమ్ము మదంతో గుడివాడలో రాజకీయాలు చేస్తున్నారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బలా చంద్రబాబుకు, ఆయనను నమ్ముకున్న ఎన్నారైలకు గుణపాఠం తప్పదన్నారు.

Also Read:రాత్రి పూట ఈ కూరగాయలు తింటే..!

- Advertisement -