ఎట్టకేలకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్. కరీంనగర్ నుండి వెలిచాల రాజేందర్ రావు, ఖమ్మం నుండి రామసహాయం రఘురాంరెడ్డి,హైదరాబాద్ నుండి మహమ్మద్ వలీవుల్లా సమీర్ పేర్లను ప్రకటించింది.
ముఖ్యంగా ఖమ్మం సీటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా పోటీపడ్డారు. ఇందుకోసం కర్ణాటకకు వెళ్లి డీకే శివకుమార్‌తో లాబీయింగ్ కూడా చేశారు. అయితే చివరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రకటించింది కాంగ్రెస్.
ఇప్పటికే రామసహాయం సురేందర్ రెడ్డి నామినేషన్ సైతం దాఖలు చేశారు. భట్టి తన భార్య నందిని కాకుంటే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేయగా పొంగులేటి తన సోదరుడికి కాకుంటే రఘురాం రెడ్డికి ఇవ్వాలని కోరగా పొంగులేటి వైపే కాంగ్రెస్ మొగ్గుచూపింది.
Also Read:KCR:కేంద్రం చేతుల్లోకి సాగర్