తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in లో విద్యార్థులు తమ మార్కులను చెక్ చేసుకోవచ్చు.
ఇంటర్ ఫస్టియర్‌లో 60.01 శాతం ఉత్తీర్ణత సాధించగా ఇంటర్ సెకండియర్‌లో 69.46 శాతం ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా కొనసాగింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇంటర్ ఫస్టియర్‌లో రంగారెడ్డి జిల్లా తొలిస్థానంలో నిలిచింది.
ఎన్నికల కోడ్‌తో ముందుగా ఫలితాలు విడుదల కాగా మార్చి 10 నుంచే స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభం కాగా ఏప్రిల్ 10తో మూల్యాంకనం పూర్తి అయింది. జవాబు పత్రాలను ఒకటికి మూడు సార్లు పరిశీలన చేసి..మార్కులను డీకోడ్ చేసి ఫలితాలను వెల్లడించారు.
Also Read: