IPL 2024:యశస్వి సెంచరీ..రాజస్థాన్ గెలుపు

54
- Advertisement -

ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ముంబై విధించిన 180 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే 180 పరుగులు చేసి చేధించింది రాజస్థాన్. ముఖ్యంగా యశస్వీ జైస్వాల్ 60 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా బట్లర్ 38, శాంసన్ 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముఖ్యంగా జైస్వాల్ సిక్స్‌లు, ఫోర్లతో ముంబై బౌలర్లపై విరుచుకపడ్డాడు. తన ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు,9 ఫోర్లు బాధాడు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 179 పరుగులు చేసింది. ఓ దశలో 52 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, నేహల్ వధేరా మరో వికెట్ కొల్పోకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. తిలక్ వర్మ 65 పరుగులు చేయగా వధే 24 బంతుల్లోనే 4 సిక్స్లు,3 ఫోర్లతో 49 పరుగులు చేశారు.

Also Read:KTR: కరీంనగర్ పార్లమెంట్ మనదే

- Advertisement -