తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతుండగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం పడింది. వర్షం కారణంగా కోతకు వచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది.
ఇక ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read:5 స్థానాల్లో అభ్యర్థుల మార్పు..మరో 2 పెండింగ్!