ఉద్యోగాల కల్పనలో జగన్ సర్కార్‌తో పాటు మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. కర్నూల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన షర్మిల..ఏపీలో పదేండ్ల పాటు పాలించిన టీడీపీ, వైసీపీతో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
వైఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు షర్మిల. ఒక్క అవకాశమంటూ అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఐదేళ్లలో ఒక్క పనిని పూర్తి చేయలేక పోయారని విమర్శించారు. కర్నూలులో న్యాయ రాజధాని కడతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
వైఎస్సార్ ప్రారంభించిన గుండ్రేవుల ప్రాజెక్టును జగన్ పెండింగ్‌లో పెట్టారని, ఇది పూర్తయి ఉంటే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు, 6లక్షల మంది కర్నూలు ప్రజలకు తాగునీరు అందేదని అన్నారు.
Also Read:3 పూటలా రోజూ ఒక లవంగం..

