పోటీపడి మరీ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు… నూరు అబద్దాలతో సమానమని మరోసారి నిరూపితమైందని ట్విట్టర్ (ఎక్స్) లో తెలిపారు.అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు పోటీ పడుతున్నారు. నిరుద్యోగ భృతి పై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీ లో ప్రకటించి అభాసు పాలైన భట్టి.. తాజాగా రుణమాఫీ పై కూడా నాలుక మడత బెట్టారన్నారు.
వంద రోజుల్లో రుణ మాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని భట్టి చెప్పడం 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచించడమే. డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో చెప్పడమే గాక, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం రుణమాఫీ పైనే అని చెప్పిన విషయం భట్టికి తెలియనట్టు నటించడం హాస్యాస్పదం అన్నారు.
ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు ఉంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ, అయిపోయాక మొండి చేయి చూపిస్తున్నది. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతారు.నిన్న నిరుద్యోగ భృతి పై ఎగవేత -నేడు రైతు రుణ మాఫీ పై దాట వేత ధోరణి .కాంగ్రెస్ నేతల మోసాలకు ఇవిగో సాక్ష్యాలు అని ఓ వీడియోని షేర్ చేశారు.
కాంగ్రెస్ లో అబద్దాల పోటీ..
పోటీపడి మరీ అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ నాయకులు..కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు… నూరు అబద్దాలతో సమానమని మరోసారి నిరూపితమైంది.
అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు పోటీ పడుతున్నారు. నిరుద్యోగ భృతి పై కాంగ్రెస్ పార్టీ… pic.twitter.com/cifNPXGhyT
— Harish Rao Thanneeru (@BRSHarish) April 19, 2024