పన్నా రాయల్ దర్శకత్వంలో వచ్చిన ‘కాలింగ్‌బెల్’ మంచి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న మరో హార్రర్ మూవీ ‘రాక్షసి’. డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పన్నా రాయల్ దర్శకత్వంలో అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ జన్ను నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పూర్ణ, అభిమన్యు సింగ్, అభినవ్ సర్దార్, సీనియర్ నటి గీతాంజలి ముఖ్య పాత్రలు పోషించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్‌లో విడుదలకు సిద్ధమైన ‘రాక్షసి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 27న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైటీ స్టార్ శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరవగా, ప్రముఖ రాజకీయ వేత్త తులసీరెడ్డి, ఐఎఎస్ ఆఫీసర్ రామచంద్రు, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మధుర శ్రీధర్‌రెడ్డి, ఆర్.పి.పట్నాయక్, నటులు శ్రీధర్, రవివర్మ, కమెడియన్ ఈరోజుల్లో సాయి, ఫణి, హీరోయిన్స్ సౌమ్య, ప్రియ, శంషాబాద్ సి.ఐ. మహేష్, హీరో అభినవ్ సర్దార్, హీరోయిన్ పూర్ణ, దర్శకుడు పన్నా రాయల్, సంగీత దర్శకుడు యాజమాన్య, సినిమాటోగ్రాఫర్ కర్ణ ప్యారసాని, సీనియర్ నటి గీతాంజలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షాని సాల్మన్ తదితరులు పాల్గొనగా, విచ్చేసిన అతిథులందరికీ డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్టైన్మెంట్ అధినేతలు అశోక్ మందా, రాజు దళవాయ్ ఫ్లవర్ బొకేలతో స్వాగతం పలికారు. ముందుగా డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్ లోగోను ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ రామచంద్రు ఆవిష్కరించారు. ‘రాక్షసి’ థియేట్రికల్ ట్రైలర్‌ను సీనియర్ నటి గీతాంజలి రిలీజ్ చేశారు. ‘రాక్షసి’ బిగ్ సిడీను, ఆడియో సీడీలను మైటీస్టార్ శ్రీకాంత్ ఆవిష్కరించి తొలి సీడీని తులసీరెడ్డికి అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో మార్కెట్లోకి విడుదలైంది.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ – ”రాక్షసి టైటిల్ చాలా బాగుంది. పాటలు, ట్రైలర్ ఇంకా బాగున్నాయి. యాజమాన్య మంచి మ్యూజిక్ డైరెక్టర్. నా సినిమా ‘రారా’కి కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఫ్యూచర్లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. సర్దార్ నాకు ఎప్పటి నుంచో మంచి మిత్రుడు. ఓ పక్క బిజినెస్ చేస్తూనే సినిమాలపై వున్న ప్యాషన్‌తో నటుడుగా కొనసాగుతున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయి సర్దార్ పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాను. పూర్ణ నటించిన సినిమాలన్నీ చూశాను. చాలా మంచి ఆర్టిస్ట్. ఈ చిత్రంలో చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. ఇలాంటి సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలైనా పెద్ద విజయాలు సాధిస్తాయని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ సినిమా ట్రైలర్ చూడగానే మంచి కంటెంట్ వుందని అర్థమవుతోంది. డెఫినెట్‌గా ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుంది. డైరెక్టర్ పన్నా రాయల్కి, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్” అన్నారు.
తులసీరెడ్డి మాట్లాడుతూ – ”ఆడియో విజయవంతమైతే సినిమా సక్సెస్ అయినట్టే. ఈ సినిమాలోని పాటలన్నీ చాలా బాగున్నాయి. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా వుంది. ట్రైలర్ చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అన్నంత ఆసక్తి కలుగుతోంది. ఈ సినిమా సక్సెస్ అయి నిర్మాతకు మంచి లాభాలు రావాలి. పన్నా రాయల్ ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం వుంది. ఈ సినిమాతో అతనికి మంచి బంగారు భవిష్యత్తు వుండాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సీనియర్ నటి గీతాంజలి మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో హీరోయిన్ పూర్ణకు నాయనమ్మ క్యారెక్టర్లో నటించాను. మా కాంబినేషన్లో చేసిన సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. షూటింగ్ చేసేటపుడే చాలా థ్రిల్‌గా ఫీల్ అయ్యాం. ఈ సినిమా గ్యారెంటీగా సక్సెస్ అవుతుంది” అన్నారు.
మధుర శ్రీధర్ మాట్లాడుతూ – ”టైటిల్, పోస్టర్స్ చాలా ఎట్రాక్టివ్‌గా వున్నాయి. ట్రైలర్ చూడగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయి. యాజమాన్య బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చాడు. సర్దార్ ప్యాషనేటెడ్ ఆర్టిస్ట్. హీరోగా అతనికి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ – ”ఇందులోని మాస్ పాట చాలా బాగుంది. పూర్ణ లుక్స్ అదిరిపోయేలా వున్నాయి. సర్దార్ మంచి హీరో. అతనితో కన్నడలో సినిమా చేశాను. త్వరలోనే ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. సర్దార్ చేసిన ‘రాక్షసి’ మంచి సక్సెస్ అయి అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.
హీరో అభినవ్ సర్దార్ మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో పూర్ణకి పెయిర్‌గా నటించాను. చిన్న పాత్ర అయినా చాలా ముఖ్యమైన పాత్ర. పూర్ణతో చేసిన రొమాంటిక్ సీన్స్ అన్నీ యూత్‌కి బాగా నచ్చుతాయి. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన పన్నా రాయల్కి, మా నిర్మాతలకు థాంక్స్” అన్నారు.
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ – ”ఒక ఇంట్లో జరిగే హార్రర్ ఎంటర్టైనర్ ఇది. ఎమోషన్స్, ఫన్, సస్పెన్స్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ వున్న ‘రాక్షసి’ డెఫినెట్‌గా మీ అందరికీ నచ్చుతుంది. నా క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ వున్నాయి. ఈ సినిమాలో రాక్షసి ఎవరు అనేది పెద్ద సస్పెన్స్. నిర్మాతలు అశోక్, రాజు, టోనీ ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. కథను నమ్మి డైరెక్టర్ మీద వున్న నమ్మకంతో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా అద్భుతంగా నిర్మించారు. ఇప్పటివరకు నేను చేసిన నిర్మాతల్లో ది బెస్ట్ ప్రొడ్యూసర్స్. కాలింగ్ బెల్ కంటే ‘రాక్షసి’ పెద్ద హిట్ అవుతుంది” అన్నారు.
డైరెక్టర్ పన్నా రాయల్ మాట్లాడుతూ – ”ఇది ఒక స్మాల్ ఫిల్మ్‌గా స్టార్ట్ అయి పెద్ద సినిమాగా మారింది. బిగ్ ప్యాడింగ్తో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించి నా కెంతో సపోర్ట్ చేసిన మా నిర్మాతలకు థాంక్స్. కాలింగ్‌బెల్ సక్సెస్ అయి నాకు ఎంతో మంచి పేరు తెచ్చింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రాక్షసి’ చిత్రాన్ని రూపొందించాను. టెక్నికల్‌గా, విజువల్‌గా ఈ సినిమా హై రేంజ్లో వుంటుంది. యాజమాన్య మంచి సాంగ్స్ ఇచ్చారు. తన రీరికార్డింగ్‌తో సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళాడు. హార్రర్ ఎంటర్టైన్మెంట్తో రూపొందిన ఈ చిత్రం ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
నిర్మాత అశోక్ మందా మాట్లాడుతూ – ”పన్నా రాయల్ ఈ సినిమాని ఎంతో కష్టపడి చేశాడు. కాలింగ్‌బెల్ కన్నా ఈ చిత్రం ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. ఈ సినిమాని కమర్షియల్ దృష్టితో కాకుండా ఒక మంచి సినిమా చెయ్యాలన్న ప్యాషన్‌తో తీశాం. ‘రాక్షసి’ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు” అన్నారు.
నిర్మాత రాజ్ దళవాయ్ మాట్లాడుతూ – ”ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ యు.ఎస్.లో చేశాం. అందరూ చాలా థ్రిల్ అయ్యేలా గ్రాఫిక్స్ వుంటాయి. ఈ సినిమా ఆడియన్స్‌కి ఒక కొత్త అనుభూతినిస్తుంది. హీరోయిన్ పూర్ణ మాకెంతో సపోర్ట్ చేసి ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా ద్వారా నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని చాలా లావిష్‌గా నిర్మించాం. జూన్‌లో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షాని సాల్మన్ మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ పన్నా రాయల్ కథ చెప్పగానే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. దాంతో ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేశాను. యాజమాన్య చాలా మంచి సాంగ్స్‌తోపాటు మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి మా నిర్మాతలు అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ జన్ను ముఖ్య కారణం. వారి సపోర్ట్‌తోనే ఈ సినిమాని ఇంత బాగా చెయ్యగలిగాం. అన్నివర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ‘రాక్షసి’ వుంటుంది. ఈ చిత్రంలో పూర్ణ, అభిమన్యు సింగ్ పెర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది” అన్నారు.
పూర్ణ, అభిమన్యుసింగ్, అభినవ్ సర్ధార్, గీతాంజలి, ప థ్వీ, బేబీ ధ్వని, బేబీ క తిక, తాగుబోతు రమేష్, ప్రభాస్ శ్రీను, ‘ఛత్రపతి’ శేఖర్, ‘ఈరోజుల్లో’ సాయి, షాని సాల్మన్, ఫణి, ప్రియ, సమ్మెట గాంధీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, సినిమాటోగ్రఫీ: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్: శ్రీసంతోష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్, నిర్మాతలు: అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ జన్ను, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్.