‘డబుల్ డోస్’ ఇస్తామంటున్న స్టార్ హీరోలు!

15
- Advertisement -

గతంలో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి హీరోలు ఏడాదికి అరడజన్ సినిమాలు విడుదల చేసేవారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు సైతం ఏడాదికి మూడు లేదా నాలుగు సినిమాలు విడుదల చేస్తూ అభిమానులను ఖుషీ చేశారు. కానీ ప్రస్తుతం టాప్ హీరోలుగా ఉన్న ఆరుగురు స్టార్ హీరోలు మాత్రం ఏడాదికి ఒకే సినిమాతో సరిపెడుతూ కాలం వెల్లదిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏడాదికి ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండా అభిమానులను నిరాశ పరుస్తుంటారు. అయితే ఇది మొన్నటివరకు.. ఇప్పుడు ట్రెండ్ మార్చే పనిలో ఉన్నారు మన స్టార్ హీరోలు. ఏడాదికి కనీసం రెండు సినిమాలనైనా బాక్సాఫీస్ వద్ద నిలిపేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. .

ఈ లిస్ట్ లో నేషనల్ స్టార్ ప్రభాస్ ముందున్నాడనే చెప్పాలి. గత ఏడాది సలార్ తో ప్రేక్షకులను పలకరించిన డార్లింగ్.. ఆరు నెలలు గడవక ముందే కల్కి 2898 ఏ.డి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత సెట్స్ పై ఉన్న రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలను కూడా ఒకే ఏడాది రిలీజ్ చేసేందుకు సిద్దమౌతున్నాడు. ఇక ప్రభాస్ దారిలోనే జూ.ఎన్టీఆర్ కూడా ఏడాదికి రెండు సినిమాలను లైన్ లో పెడుతూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం దేవర పార్ట్ 1 మూవీతో పాటు వార్ 2 మూవీ కూడా ఏక కాలంలో షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

దేవర ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కానుండగా వార్ 2 డిసెంబర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ కూడా అట్లీ ప్రాజెక్ట్, త్రివిక్రమ్ తో చేయబోయే మూవీ.. రెండిటిని ఒకే సారి చేసే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ తో బిజీగా ఉన్న బన్నీ ఆ తర్వాత అట్లీ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లి ఆ వెంటనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. ఇలా స్టార్ హీరోలు ఒకే సారి రెండు మూవీస్ ను సెట్స్ పై ఉంచుతూ ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేసే దిశగా అడుగులు వేస్తుండడంతో వారి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read:TTD:శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా అప్‌డేట్

- Advertisement -