తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలను విదేశాలలో కూడా ప్రదర్శిస్తూ,పరిరక్షిస్తూ,విశ్వవ్యాప్తం చేస్తున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (కెనడా) వారు రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన తెలంగాణ నైట్ -2017 సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం ఆనందోత్సవాహాల మధ్య మే27,2017 న టొరంటో లోని స్టీఫెస్ లెవీస్ సెకండరీ స్కూల్ లో అత్యంత ఘనంగా జరిగింది. గ్రేటర్ టోరంటోతో బాటు సుదూరాల నుంచి కూడా ప్రవాస తెలంగాణ వాసులు సుమారు 600 మంది ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంతోషాన్ని తోటి వారితో పంచుకున్నారు . ఈ సందర్భంగా కెనడా లో వ్యాపారవేత్తగా విజయవంతమైన బోధస్ వాసి అక్కిపల్లి ఉత్తమ్ కుమార్ కి ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డును ప్రధానం చేయబడింది.
ఆద్యంతం తెలంగాణ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రవాస తెలంగాణ కుటుంబాలకు చెందిన పిల్లలు, పెద్దలు ప్రదర్శించిన ఆటలు,పాటలు, వివిధ సాంస్కృతిక అంశాలు ఆహూతులను విశేషం గా ఆకట్టుకున్నాయి. అచ్చ తెలంగాణ రుచులతో కూడిన విందు భోజనాన్ని కూడా ఈ కార్యక్రమంలో అందించడం విశేషం. టొరంటో లోని భారతీయ దౌత్యాధికారి శ్రీ దేవీందర్ పాల్ సింగ్ ముఖ్య అతిథి గా విచ్చేసి అందరికి తెలంగాణ రాష్ట్రావతరణ శుభాకాంక్షలు అందజేశారు.
విదేశీ భారతీయ ముఖ్యంగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను సుసంపన్నం చేస్తున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (కెనడా) వారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేసిన నిర్వాహక కమిటీ సభ్యులు దీనికి కారణమైన పాల్గొన్న ప్రతివారికీ, కళాకారులకు,స్పాన్సర్స్ మరియు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదే సందర్భంగా 2017-18 సంవత్సరానికి నాయకత్వాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఫౌండేషస్ కమిటి చైర్మస్ గా శ్రీ మాణిక్ రెడ్డి గంటా,బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మస్ గా శ్రీ జితేందర్ గార్లపాటి,ఉపాధ్యక్షురాలిగా శ్రీమతి అనిత పినికేశి ఎన్నికయ్యారని,అలాగే ఫోరమ్ అధ్యక్షులుగా శ్రీశ్రీకాంత్ రెడ్డి నెర్వేట్ల , ఉపాధ్యక్షురాలిగా శ్రీమతి విజయ లక్ష్మీ మడుపు, ప్రధాన కార్యదర్శిగా పవసి కుమార్ కొండం, సంయుక్త కార్యదర్శిగా శ్రీ అర్షద్ ఘోరీ కోశాధికారిగా మహేందర్ రెడ్డి కీసర, సంయుక్త కోశాధికారిగా శ్రీశ్రీనివాస్ కొలను లను, ఇతర కమిటీ లకు నిర్వాహకులను కూడా ప్రకటించారు.