తెలంగాణ భవన్ లో ఈనెల 18 వ తేదీ గురువారం నాడు, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ..బి ఫారాలు అందజేయనున్నారు. అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకోనున్నారు.
ఈ మేరకు అదే రోజు జరిగే సుధీర్ఘ సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో… ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసన సభ్యులు,ఎంఎల్సీలు, మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్ పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. ఆహ్వానితులందరికీ తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం లంచ్ ఏర్పాట్లుంటాయి.
కాగా…. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి మోసపోయినామని చింతిస్తున్న తెలంగాణ ప్రజలు.. కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నది. తమ హక్కులు కాపాడబడాలంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ఆదరించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటన్నట్టు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అధినేత కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నారు. ఇప్పటికే జరిపిన బహిరంగ సభలకు విపరీతమైన ప్రజా స్పందన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలకు మరింత చేరుకావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రేస్ తెచ్చిన కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెల్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసానివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ గారు నిర్ణయించారు.
ఏప్రిల్ 18వ తేదీ గురువారం నాడు జరగనున్న ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ గారి బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.
Also Read:బ్లాక్ క్యారెట్ ప్రయోజనాలు తెలుసా?