ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హెపటైటిస్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదొక కాలేయ సంబంధిత వ్యాధి. మద్యం లేదా వివిధ రకాలైన ఆహారం లేదా మెడిసన్ కారణంగా లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఈ వ్యాధి సంభవిస్తుంది. హెపటైటిస్ అనేది కాలేయ సంబంధిత వ్యాధి కావడంతో దీని పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హెపటైటిస్ వ్యాధిలో ఏ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలుగా ఉంటుంది. హెపటైటిస్ ఏ అనేది తాత్కాలిక లివర్ సమస్య. దీనికి సరైన వైద్యం తీసుకుంటే హెపటైటిస్ ఏ నుంచి త్వరగా బయట పడవచ్చు. అయితే ఇది గర్భిణీ స్త్రీ లకు మాత్రం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. హెపటైటిస్ బి అనేది హెచ్ బి వి ( HBV ) అనే వైరస్ వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది.
రక్త మార్పిడి, సెక్స్ కలయిక.. ద్వారా కూడా హెపటైటిస్ బి వచ్చే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణులు. ఇక సి విషయానికొస్తే మద్యం, డ్రగ్స్, మొదలైనవి తీసుకోవడం వల్ల అవయవాలు పనితీరు క్షీణించి ఈ సమస్య ఏర్పడుతుంది. ఇక డి, ఇ వంటివి కూడా పై కారణాల చేతనే సంభవించే అవకాశం ఉంది. హెపిటైటిస్ బారిన పడిన వారిలో తీవ్రమైన అలసట, ఆకలి మందగించడం, అతిసారం, కామెర్లు, మూత్రం యొక్క రంగు మారడం, వికారం, వాంతులు.. లాంటి లక్షణాలు కనిపిస్తాయి. హెపటైటిస్ అనేది అంటువ్యాధి కావడంతో దీని పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా హెపటైటిస్ తో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు నివేధికలు చెబుతున్నాయి. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి సరైన వైద్యం తీసుకుంటే హెపటైటిస్ నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:‘బహుముఖం’ మూవీ రివ్యూ..