బీజేపీకి ఓటుతో బుద్దిచెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని మోడీ అవ మానించారని…విభజన చట్టంలోని హామీలను సైతం కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. బీజేపీ మత భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తుందని, మోడీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని? ప్రశ్నించారు.
మోడీ, అమిత్ షా కలిసి దేశంలోని నవరత్న సంస్థలను అమ్మారని ఆరోపించారు. ఏప్రిల్ 14న బీజేపీ వైఫల్యాలపై కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో దీక్షకు దిగనున్నట్లు చెప్పారు. తెలంగాణ అమరులను ప్రధాని అవమానించారని …తెలంగాణలో ఓట్లు అడగడానికి మోడీకి ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. అభివృద్ధి ఏం చేశారని అడిగితే అది పక్కన పెట్టి గాలి కబుర్లు, సొల్లు కబుర్లు చెబుతున్నారు.
రాముడిని రాజకీయాల కోసం వాడుకోవడం తప్పని… సికింద్రాబాద్‌కు తెలంగాణ బీజేపీ అధినేత కిషన్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు. చేనేత కార్మికులకు బీజేపీ అన్యాయం చేసిందని అన్నారు. గుర్తింపు కోసమే కొందరు బీజేపీ నాయకులు కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:10 నిమిషాలు పరిగెత్తితే..ఎన్ని ప్రయోజనాలో!