వేసవిలో రోడ్డు పక్కన ఎక్కడ చూసిన చెరుకురసం అమ్మే షాపులు కనిపిస్తుంటాయి. తక్కువ ధరకు లభించడంతో పాటు వేసవి తాపాన్ని తగ్గించడంలో చెరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే చాలమంది చెరుకురసం తాగేందుకు ఇష్టపడుతుంటారు. ఇది తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. చెరుకులో ఉండే సహజసిద్దమైన లాక్టోజ్ మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. ఇంకా ఇందులో విటమిన్ సి, ఇ, ఏ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. తద్వారా రోగ నిరోదక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి. ఇలా చెరుకు రసం తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే అందరూ తగవచ్చా ? అంటే నో అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. .
కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు చెరుకురసంకు దూరంగా ఉండడమే మంచిదట. ముఖ్యంగా తలనొప్పితో బాధ పడేవారు చెరుకు రసం తాగకపోవడం మంచిది. ఎందుకంటే ఇది ఆ సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది. ఇంకా జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండాలి. చెరుకులో సహజంగానే చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా దగ్గు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అలాగే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కూడా చెరుకురసానికి దూరంగా ఉండాలి.
ఇక అధిక బరువుతో బాధపడేవారు సైతం చెరుకు రసానికి దూరం పాటించాలి. దీనిని తాగడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. విరోచనాలతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో చెరుకు రసం తాగరాదు. ఒకవేళ తాగితే విరోచనాల తీవ్రత మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అలాగే గుండె సంబందిత వ్యాధిగ్రస్తులు, హైబీపీతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకే చెరుకు రసం సేవించాలి. కాబట్టి వేసవిలో అధికంగా లభించే చెరుకురసం తాగే విషయంలో పైన చెప్పబడిన సమస్యలు ఉన్నవారు వీలైనంతవరకు దూరంగా ఉండడమే మంచిది.
Also Read:టీడీపీలో ‘ఉండి’ టికెట్ రచ్చ!