వెంటనే ఉరి తీయండి..

196
- Advertisement -

భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను త్వరగా ఉరితీయాలని పాకిస్థాన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కుల్‌భూషణ్‌ గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

జాదవ్‌కు పాక్‌ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయడంలో కింది న్యాయస్థానం విఫలమైందని ఇకనైనా ఆలస్యం చేయకుండా జాదవ్‌ను తక్షణమే ఉరితీయాంటూ మాజీ సెనేట్‌ ఛైర్మన్‌, న్యాయవాది ఫరూఖ్‌ నక్‌ శనివారం పిటీషన్‌ను దాఖలు చేశారు.
  Petition in Pakistan Supreme Court seeks immediate execution of Kulbhushan Jadhav
గూఢచర్యం ఆరోపణలతో గతేడాది మార్చి నెలలో జాదవ్‌ను బలూచిస్థాన్‌లో పట్టుకున్నట్లు పాక్‌ చెబుతోంది. దాంతో అతడిపై కేసు పెట్టి విచారించిన పాక్‌ సైనిక కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. కానీ ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను అన్యాయంగా పట్టుకొచ్చి గూఢచర్యం ఆరోపణలు చేస్తున్నారని భారత్‌ వాదిస్తోంది.

భారత్‌ వాదనలకు పాక్‌ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ అంజద్‌ షోయబ్‌ మద్దతు పలికారు. పాక్‌ తీర్పును సవాలు చేస్తూ భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)ను ఆశ్రయించింది. జాదవ్‌ కేసును విచారించిన న్యాయస్థానం భారత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. తదుపరి విచారణ జరిపేంత వరకు పాక్‌ జాదవ్‌కు మరణశిక్ష వాయిదా వేయాలంటూ స్టే విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -