Pushpa 2:పుష్ప 2 టీజర్ వచ్చేసింది

33
- Advertisement -

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి.

ఇక ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 టీజర్‌ని రిలీజ్ చేశారు. టీజర్‌లో డైలాగ్ లేకపోయినా జాతర బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చే ఫైట్ సీన్ అని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియ‌స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించాడు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -