Congress:గ్యారెంటీలకు నో ‘గ్యారెంటీ’ ?

21
- Advertisement -

తెలంగాణలో గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేంద్రంలో అధికారం కోసం కూడా గ్యారెంటీల మంత్రాన్నే జపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ పాంచ్ న్యాయ్ పేరుతో ఐదు విభాగాల్లో 25 గ్యారెంటీ హామీలను తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే సంగతి అటుంచితే.. ఆల్రెడీ అధికారంలో ఉన్న తెలంగాణలో గ్యారెంటీ హామీలను అమలు చేస్తోందా ? అంటే ముమ్మాటికి లేదనే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని వచ్చిన కాంగ్రెస్.. తీర అధికారంలోకి వచ్చిన తరువాత అడపా దడపా హామీలను అమల్లోకి తెచ్చి అసలు హామీలను పక్కన పెట్టేసింది. .

వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమల్లోకి తెస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. వంద రోజులు పూర్తయ్యే సరికి తుచ్ అంటూ మాట మార్చేసింది. ఇప్పుడేమో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇచ్చిన గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని సి‌ఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అంటే ఇంకా పెండింగ్ లో ఉన్న రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకం కింద రూ.15 వేలు, మహిళలకు ప్రతి నెల రూ.2500.. ఇలా ఈ హామీల అమలు లేనట్లేనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం ఇచ్చిన హామీలను పక్కన పెట్టేస్తారా ? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆల్రెడీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే హామీల అమలు జరగకపోతే.. ఇక కేంద్రంలో అధికారంలోకి వచ్చిన హామీల అమలు జరగడం కష్టమే అనే సందేహాలు కూడా అడపా దడపా వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందనే విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. తెలంగాణలో పరిస్థితులను గమనిస్తే చేతి గుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం గ్యారెంటీ అనే వాదన ప్రజల్లో వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే లోక్ సభ ఎన్నికల్లో హస్తం పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.

https://x.com/Vshnuvardhn_rdy/status/1776820494513352896

Also Read:KTR:రైతుల బాధ కనిపించడంలేదా?

- Advertisement -