రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలో చేపట్టిన రైతు దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇంత త్వరగా రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం గురించి మాట్లాడుకోవాల్సి రావటం బాధాకరం అని అన్నారు.ఎర్రటి ఎండల్లోనూ కేసీఆర్ రైతుల కోసం బయటకు వచ్చి నేనున్నా అని వారికి భరోసా ఇస్తున్నారు. కేసీఆర్ బాటలో నడుస్తూ రైతుకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సైతం రైతు దీక్ష కార్యక్రమం చేస్తున్నాయి అని తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసమే లక్షల ఎకరాల పంట పొలాలను కాంగ్రెస్ ఎండబెట్టింది. కేసీఆర్ ను బద్నాం చేయాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ… పంటలు ఎండబెట్టి రైతుల పొట్ట కొడుతోంది అని అన్నారు.డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి… ఇప్పటికీ ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదు.ఎన్నికల కోడ్ తో రేవంత్ రెడ్డి పాలన అధికారం నా చేతిలో లేదు అంటున్నాడు. ఆయనకు ఉన్న అవగాహన అది. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే రైతు హామీలపైన మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పాలన్నారు.
500 రూపాయల బోనస్ తో పాటు, రైతుల పంట నష్టానికి ఎకరానికి రూ. 25 వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయండి. మా పార్టీ తరఫున కూడా మద్దతు ఇస్తాం అని అన్నారు.
Also Read:Jagan:జగన్పై పోటీకి..భారీ స్కెచ్!

