రేవంత్ రెడ్డిపై బక్క జడ్సన్ ఫైర్

14
- Advertisement -

పార్టీ వ్యతిరే కకార్యక్రమాలకు పాల్పడుతున్నారని సీనియర్ నాయకుడు బక్క జడ్సన్‌పై ఆ పార్టీ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చెన్నారెడ్డి తెలిపారు. తన సస్పెండ్‌ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు జడ్సన్.

తెలంగాణలో అసలైన కాంగ్రెస్‌ కార్యకర్తలను భక్షిస్తున్న తోడేలుకు నాయకత్వాన్ని అప్పగించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 1989 నుంచి కాంగ్రె స్‌ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నందుకు సరైన గుర్తింపు లభించిందని … తనకు మద్దతునిచ్చిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాలకు ధన్యవాదాలు తెలిపారు.

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు జడ్సన్‌. ఉప్పల్ ప్రెస్‌క్లబ్‌లో దళిత యువకులపై దాడి చేశారని…ఈ కేసులో ఈటలను ఏ1గా చేర్చాలని డిమాండ్ చేశారు.

Also Read:అజయ్ దేవగణ్.. మైదాన్

- Advertisement -