సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయికగా నటించారు. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
సూర్య తేజ జీవితంలో అనేక సమస్యలతో వున్న యంగ్ ఫిల్మ్ మేకర్స్ రాజు సుందరంగా పరిచయం కావడంతో ట్రైలర్ మొదలౌతుంది. హర్షవర్ధన్ గ్యాంగ్‌స్టర్‌గా ఎంట్రీ తర్వాత, వైవా హర్ష సినిమా హీరోగా పరిచయం అయ్యాడు. తప్పని పరిస్థితుల్లో, హీరో రాంగ్ పాత్ ని ఎంచుకుంటాడు. దీంతో రాత్రికి రాత్రే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవుతాడు.సూర్య తేజ తన మొదటి సినిమాలోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు. అమాయకంగా కనిపించినప్పటికీ, అతను తెలివిగలవాడు. సూర్యకు జోడిగా మీనాక్షి గోస్వామి కనిపించింది. సినిమా హీరోగా వైవా హర్ష ట్రాక్ మెయిన్ హైలైట్‌లలో ఒకటి. హర్షవర్ధన్ నెగిటివ్ రోల్ పోషించగా, అజయ్ ఘోష్ పోలీసుగా కనిపించాడు. వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా యొక్క ఫన్, క్రైమ్ అంశాలను ఎలివేట్ చేసింది, వెంకట్ ఆర్ శాకమూరి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. రవితేజ గిరిజాల ఈ చిత్రానికి ఎడిటర్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మరో రెండు వారాల్లో రాబోతున్న ఈ సినిమాపై ట్రైలర్ మంచి అంచనాలను నెలకొల్పింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ.. సూర్య కి బెస్ట్ డెబ్యు దొరికింది. దానికి కారణం సూర్యకి బెస్ట్ డాడ్ ధని వున్నారు. దాని వలనే బెస్ట్ కంటెంట్, బెస్ట్ సపోర్ట్ దొరికింది. భరతనాట్యం క్రైమ్ కామెడీ. ఇది సక్సెస్ ఫుల్ జానర్. ఇంత మంచి ఎంటర్ టైనర్ ద్వారా తను పరిచయం కావడం ఆనందంగా వుంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా వుంది. ట్రైలర్ లో హిట్ కళ కనిపిస్తోంది. నిర్మాత పాయల్ గారిలో ఎలాంటి ఒత్తిడి కనిపించడం లేదు. దీనికి కారణం కంటెంట్ ఇచ్చిన భరోసా. దర్శకుడు మహేంద్ర కి కూడా ఇది మైల్ స్టోన్ సినిమా కావాలి. ధని సినిమా పరిశ్రమనే నమ్ముకొని వున్నారు. తను గ్రేట్ పెయింటర్. ఇప్పుడు తన కొడుకుని కూడా నటుడిగా పరిచయం చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా తప్పకుండా అందరికీ మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరో సూర్య తేజ ఏలే మాట్లాడుతూ.. కంటెంట్ నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకుడు కేవీఆర్ మహేంద్ర గారు చాలా అద్భుతమైన చిత్రాన్ని అందించారు. ట్రైలర్ లాంచ్ చేసిన కోన వెంకట్ గారికి ధన్యవాదాలు. హర్ష వర్ధన్ గారికి, వైవాహర్షకి, కృష్ణుడు గారు, సలీం.. వీరి పాత్రన్నీ అలరిస్తాయి. మీనాక్షి గోస్వామి చక్కగా నటించారు. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ట్రైలర్ లో వుండే ఎనర్జీ థియేటర్స్ లో వుంటుంది. ఏప్రిల్ 5న సినిమా వస్తోంది. పుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ ఇది. మీరంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.
దర్శకుడు కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ.. దొరసాని చిత్రానికి భిన్నంగా చేసే అవకాశం ఈ సినిమాతో దొరికింది. దాన్ని ఒక సవాల్ గా తీసుకొని ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఇందులో చాలా మంచి డ్రామా వుంటుంది. కంటెంట్ బావుంటే సినిమాలు పాన్ ఇండియా వెళ్తున్నాయి. ఈ సినిమాకి ఆ బలం వుందని భావిస్తున్నాను. కథలో చాలా బలం వుంది. ఇందులో వుండే పాత్రలన్నీ కొత్తగా వుంటాయి. సూర్య పాత్రలో లీనమై చేశాడు. ఇందులో కొత్త హర్షవర్ధన్ గారిని చూస్తారు. ప్రేక్షకులు కొరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. నలఫై నిమిషాల పాటు కడుపుబ్బానవ్వించే సీక్వెన్స్ లు వుంటాయి. నిర్మతాలు చాలా సపోర్ట్ చేశారు. ట్రైలర్ లాంచ్ చేసిన కోన వెంకట్ గారికి ధన్యవాదాలు. మీ అందరి సహకరం కావాలి’ అని కోరారు.
Also Read:ఫిల్మ్ జర్నలిస్ట్‌లకు హెల్త్ కార్డులు..