ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎలక్షన్స్ కు సరిగ్గా 50 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి, ఇదిలా ఉంటే రోజుకో సర్వే పుట్టుకొస్తు పోలిటికల్ హీట్ ను రెట్టింపు చేతున్నాయి. ఇప్పటికే చాలా సర్వేలు బయటకు వచ్చాయి. కొన్ని సర్వేలు వైసీపీకె మరోసారి అధికారం అంటూ వెల్లడిస్తుంటే, మరికొన్ని సర్వేలు టీడీపీ జనసేన బీజేపీ కూటమిదే అధికారం అని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరుతో ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ జనసేన బిజెపి కూటమి 81 సీట్లకు సాధిస్తుందని, వైసీపీ 53 సీట్లు సాధించే అవకాశం ఉందని దాదాపు 41 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉందని ఆ సర్వే వెల్లడించింది.
ఈ సర్వేను బట్టి చూస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది అంచనా వేయడం కష్టమేనని చెబుతున్నారు రాజకీయ నిపుణులు. ఈసారి గెలుపు విషయంలో ఇరు పక్షాలు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాయి. జగన్ పాలనపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని కూటమిలోని అగ్రనేతలు చెబుతుంటే.. ఐదేళ్ల పాలనలో తాము అందించిన సంక్షేమ పథకాలే మరోసారి అధికారాన్ని కట్టబెడతాయని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు, అయితే ఇరు పక్షాల అభిప్రాయాలు వాస్తవానికి దగ్గరగా ఉండడంతో ప్రజాభిప్రాయం ఎలా ఉండబోతుందనేది అత్యంత ఆసక్తిని కలిగిస్తున్న అంశం. మరి గెలుపు విషయంలో సర్వేలు కూడా అంచనా అంచన వేయలేకపోతుండడంతో ఈసారి ఎన్నికల్లో టాఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది, మరి ఎవరు అధికారంలోకి వస్తారు ? ఎవరు ప్రతిపక్షానికి పరిమితం అవుతారు ? అనేది తెలియాలంటే ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read:చైతన్య రావు… ‘పారిజాత పర్వం’