సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా, వడగండ్లు పడుతున్నా.. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారే తప్ప రైతులు గోడు పట్టించుకోవడం లేదెందుకని నిలదీశారు.
ముఖ్యమంత్రి గారూ.. రైతులంటే మీకు ఎందుకింత చిన్నచూపు..? నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు. నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా..? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..?ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..? సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప.. ఏం కనిపించదా అని ప్రశ్నించారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ముఖ్యమంత్రి గారు..
రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు..
నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు..ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప..
గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా…?
అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..??ఎన్నికల గోల… pic.twitter.com/CUcrdomGku
— KTR (@KTRBRS) March 20, 2024
Also Read:Sukumar:సుక్కు నెక్ట్స్ ఎవరితో?