ప్రజల గుండెల్లో కేసీఆర్‌:ఆర్‌ఎస్పీ

27
- Advertisement -

బీఆర్ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్పీ..ప్రత్యేకమైన పరిస్థితుల్లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్‌లో చేరుతున్నానని తెలిపారు. తెలంగాణ వాదం,బహుజన వాదం రెండు ఒక్కటే అన్నారు.

తెలంగాణ నాడు తరతరాల అణచివేతకు గురైందన్నారు. అలాగే బహుజనవాదం కూడా తరతరాలుగా అణచివేతకు గురైందన్నారు. ఈ రెండింటింలో అణచివేత కామన్‌గా ఉందన్నారు. తెలంగాణ పది సంవత్సరాలుగా స్వర్ణయుగంలో ఉందన్నారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారన్నారు.

బహుజనవాదం అంటే ఆశ, బహుజనవాదం అంటే స్వార్థ పరులు కాదని, సంపద కోసం వచ్చే వారు కాదన్నారు. బహుజనులు అంతా కేసీఆర్ వెంటే నడవాలన్నారు. ఏది ఆశించి రాలేదని, తెలంగాణ పునర్మిణామంలో భాగస్వామై వచ్చానని తెలిపారు ఆర్‌ఎస్పీ. ఈ రెండు సంవత్సరాలుగా తనతో నడిచిన బహుజనులుందరికి ధన్యవాదాలు తెలిపారు. తనలో ఎలాంటి స్వార్థం లేదని అర్థం చేసుకోవాలన్నారు. వేదిక ఏదైనా తనలో బహుజనవాదం ఎప్పటికి ఉంటుందన్నారు.

Also Read:అప్పుడు తిట్లు ఇప్పుడు పొగడ్తలు!

- Advertisement -